వాలంటీర్ వ్యవస్థ తొలగింపుపై ఈసీ పునరాలోచించుకోవాలి: తమ్మినేని సీతారాం - Speaker Tammineni Press Meet - SPEAKER TAMMINENI PRESS MEET
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 1, 2024, 10:55 AM IST
Speaker Tammineni Sitaram Press Meet: వాలంటీర్లను తొలగించాలంటూ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు మంచిదేనని, అయితే మరి వారి సేవలు ఎవరు చేస్తారని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటుతో ప్రజలకు ప్రభుత్వం సేవ చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. వారిని తొలగించాలనడం సబబు కాదన్నారు. వారంతా రాజీనామా చేస్తే ఎవరు ఆ పని చేయాలో ఎన్నికల కమిషన్ స్పష్టత ఇవ్వలేదన్నారు. వాలంటీర్ వ్యవస్థ తొలగింపుపై ఈసీ పునరాలోచించుకోవాలని కోరారు. ప్రభుత్వమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సీఈసీ(CEC) చెప్పిందని తమ్మినేని వ్యాఖ్యానించారు.
"వాలంటీర్లను తొలగించాలంటూ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు మంచిదే. అయితే మరి వారి సేవలు ఎవరు చేస్తారు? వాలంటీర్ వ్యవస్థ తొలగింపుపై ఈసీ పునరాలోచించుకోవాలి. వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటుతో ప్రజలకు ప్రభుత్వం సేవ చేస్తోంది. వాలంటీర్లను తొలగించాలనడం సబబు కాదు. వారంతా రాజీనామా చేస్తే ఎవరు ఆ పని చేయాలో ఎన్నికల కమిషన్ స్పష్టత ఇవ్వలేదు. ప్రభుత్వమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సీఈసీ చెప్పింది." - తమ్మినేని సీతారాం, స్పీకర్