ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తెలుగుదేశం, వైఎస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లపై నేడు స్పీకర్ విచారణ - MLAs Disqualification Petition

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 29, 2024, 9:35 AM IST

Updated : Jan 29, 2024, 9:51 AM IST

Speaker Hearing YSRCP and TDP Rebel MLAs Disqualification Petition: తెలుగుదేశం, వైఎస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లపై నేడు స్పీకర్ విచారణ చేపట్టనున్నారు. వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశంలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలను ఈరోజు ఉదయం విచారిస్తారు. తర్వాత తెలుగుదేశం రెబల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, మద్దాలి గిరిధర్, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్‌లను విచారిస్తారు. అనర్హత పిటిషన్లపై సమాధానం ఇవ్వడానికి 30 రోజుల సమయం కావాలన్న వైఎస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేల వినతిని స్పీకర్ తిరస్కరించారు. 

సహజ న్యాయ సూత్రాల ప్రకారం సమాధానం ఇవ్వడానికి 30 నుంచి 60 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుందని.. ఇప్పటికే స్పీకర్​కు వైఎస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. నోటీసుతో పాటు పంపిన పేపర్, వీడియో క్లిప్పింగులు అసలైనవో.. మార్ఫ్ చేసినవో నిర్ధారించుకోవాల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు. 30రోజుల సమయం కుదరదని స్పీకర్ స్పష్టం చేశారు. నోటీసులతో పాటు పేపర్, వీడియో క్లిప్పింగులు వాట్సాప్‌కు పంపామని స్పీకర్ కార్యాలయం తెలిపింది. ఈ నేపథ్యంలో ఉదయం తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు రానున్న వైఎస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు.. స్పీకర్ నోటీసులపై నిపుణులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు.

Last Updated : Jan 29, 2024, 9:51 AM IST

ABOUT THE AUTHOR

...view details