ఫరూఖ్‌ను పరామర్శించిన పలువురు నేతలు- ప్రాణాపాయం లేదన్న వైద్యులు - Some LEADERS VISIT IN FAROOQ - SOME LEADERS VISIT IN FAROOQ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 10, 2024, 9:20 AM IST
Some leaders visit Nandyal Hospital in Farooq: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూఖ్ నంద్యాలలోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ముక్కు లోపలి భాగం గాయమైనట్లు వైద్యులు తెలిపారు. వైద్యుల సూచన మేరకు అన్ని రకాల స్కానింగ్‌లు చేయించారు. ఫరూఖ్‌కు ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రాధమికంగా తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగిందని సమాచారం తెలుసుకున్న ఫరూఖ్‌ను టీడీపీ నేతలు బైరెడ్డి శబరి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డి పరామర్శించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఫరూఖ్ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వారు తెలిపారు. వైసీపీ ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, మున్సిపల్ ఛైర్ పర్సన్ మాబున్ని, పలువురు వైసీపీ నాయకులు ఫరూఖ్‌ను పరామర్శించారు
నంద్యాల జిల్లాలోని పాణ్యం మండలం తమ్మరాజు పల్లె గ్రామ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం ఫరూఖ్ కారుకు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కారులో ప్రయాణిస్తున్న ఎన్ఎండి ఫరూక్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అనంతరం అతనిని నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది.