ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సింహాచలంలో వినోదోత్సవం - భక్తులను ఆటపట్టించిన అర్చకులు - simhadri appanna vinodotsavam

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 24, 2024, 7:55 PM IST

Simhachalam Simhadri Appanna Vinodotsavam: విశాఖ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో బుధవారం వినోదోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో సరదా సంఘటన చోటు చేసుకుంది. వినోదోత్సవంలో భాగంగా అర్చకులు సరదా కార్యక్రమం నిర్వహించటంతో భక్తులు కాసేపు ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి తమ జన్మ ధన్యమయిందనుకున్నారు. 

సింహాద్రి అప్పన్న ఆలయంలో దొంగలు పడ్డారని, స్వామి వారి ఉంగరం దోచుకెళ్లారంటూ ఆలయ అర్చకులు హడావుడి చేశారు. స్వామి వారి దర్శనార్థం వచ్చిన భక్తులను అనుమానించారు. ఈ క్రమంలో కొందరు భక్తులను తాళ్లతో బంధించి, పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటనతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. సదరు భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అక్కడి పోలీసులను కోరారు. తాము దేవుని ఉంగరం తీయడం ఏమిటని కొందరు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి స్వామి వారి మేలి ముసుగు వస్త్రంలో ఉంగరం ఉందంటూ అర్చకులు చెప్పడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. తమను అనుమానిస్తున్నారని ఆవేదన చెందిన భక్తులను ఆశ్చర్యపరుస్తూ కాసేపటికి అర్చకులు ఇదంతా అబద్ధమని, స్వామి వారికి నిర్వహించే వినోదోత్సవంలో భాగంగా ఈ నాటకం ఆడామని అర్చకులు చెప్పారు. 

ఇది కథ: స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముందు రోజు స్వామివారి అమ్మవారితో వేటకు వెళ్తారు. వేటకు వెళ్లేటప్పుడు పొరపాటున స్వామివారి ఉంగరం మాయమైపోతుంది. అప్పుడు అమ్మవారు ఉంగరం తీసుకుని వస్తేనే ఇంటికి రమ్మని లేకపోతే రావద్దని అంటారు. దానిలో భాగంగా ఈ వినోదం నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు. అంతా అయిన తర్వాత స్వామివారి మేలి ముసుగులో ఈ ఉంగరం దొరుకుతుంది 

ABOUT THE AUTHOR

...view details