ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఎస్సీ, ఎస్టీలపై ప్రభుత్వ తీరు పట్ల ఆగ్రహం - ఉద్యోగానికి సచివాలయ వెల్ఫేర్ కార్యదర్శి రాజీనామా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 4, 2024, 10:58 AM IST

Secretariat Welfare Secretary Fire on YSRCP Govt: బాపట్ల జిల్లా చీరాల పురపాలక సంఘం పరిధిలోని సచివాలయ వెల్ఫేర్ కార్యదర్శి కె. విజయ్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని కమిషనర్ విజయసారథికి అందజేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ఎస్సీ, ఎస్టీలను విద్య, ఉద్యోగాలకు దూరం చేస్తోందని విజయ్ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిందన్నారు. అంబేడ్కర్ విదేశీ విద్య పథకాన్ని.. జగనన్న విదేశీ విద్యగా మార్పు చేయడం బాధ కలిగించిందన్నారు. రానున్న ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీల ఓట్లు వైఎస్సార్సీపీకి పడకుండా అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ తమ వర్గానికి జరుగుతున్న అన్యాయంపై వివరిస్తానని విజయ్ తెలిపారు.

"వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ఎస్సీ, ఎస్టీలను విద్య, ఉద్యోగాలకు దూరం చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసింది. అంబేడ్కర్ విదేశీ విద్య పథకాన్ని.. జగనన్న విదేశీ విద్యగా మార్పు చేయడం బాధ కలిగించింది. రానున్న ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీల ఓట్లు వైఎస్సార్సీపీకి పడకుండా అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ మా వర్గానికి జరుగుతున్న అన్యాయంపై వివరిస్తాను." - కె. విజయ్, సచివాలయ వెల్ఫేర్ కార్యదర్శి

ABOUT THE AUTHOR

...view details