ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తీరం దాటి దూసుకొచ్చిన సముద్ర జలాలు - "ప్రమాదానికి సంకేతం" - ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు - MANGINAPUDI BEACH MACHILIPATNAM

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 18, 2024, 5:28 PM IST

Sea Water Increasing in Manginapudi Beach Areas Krishna District : కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్ ప్రాంతాల్లో సముద్రపు నీరు ముందుకు రావడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా గత మూడు రోజులుగా సముద్ర జలాలు తీరం వైపు కొన్ని మీటర్ల మేర ముందుకు వస్తున్నాయి. ఒడ్డున ఉన్న దుకాణాలు, చిరు వ్యాపారస్తులు వ్యాపారాలు నిర్వహించుకునే ప్రదేశాల వరకు నీరు వచ్చేయడంతో వారు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే పరిస్థితి ఎన్ని రోజులు కొనసాగుతుందో ఏదైనా ప్రమాదకర పరిస్థితి ఎదురవుతుందో అన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. ఈ విషయం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ దృష్టికి రావడంతో సంబంధిత అధికారులతో మాట్లాడి అప్రమత్తం చేశారు.

ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సెప్టెంబర్‌ 5తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని తెలిపింది. కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకొని ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details