జగన్ మాయమాటలు నమ్మి మందడంలో మూడు రాజధానుల శిబిరం నిర్వహించాం- ఎస్డీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు - Madigani Gurunatham on CM Jagan - MADIGANI GURUNATHAM ON CM JAGAN
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 14, 2024, 5:19 PM IST
SDF State President Madigani Gurunatham Fire on CM Jagan : తాడేపల్లి రాజకోట రహస్యాలు రోజుకు ఒకటి బయట పెడతానని ఎస్డీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మాదిగాని గురునాథం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాలుగేళ్లుగా తమకు మాయమాటలు చెప్పి మోసం చేశారని గుర్తు చేశారు. సీఎం మాయమాటలు నమ్మి నాలుగేళ్లుగా గుంటూరు జిల్లా మందడం వద్ద మూడు రాజధానుల శిబిరం నిర్వహించామని తెలిపారు. రాజధానిలో మాస్టర్ ప్లాన్ విచ్ఛిన్నం కాకుండా ఉండాలంటే ఆర్ 3 జోన్లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పినా వినకుండా ఆర్ 5 జోన్లో స్థలాలు కేటాయించి ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో అంబేద్కర్ విగ్రహానికి గురునాథం పూలమాల వేసి నివాళులు అర్పించారు. అక్రమ కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని 53 రోజులు జైల్లో పెట్టిన జగన్, దస్తగిరిని ఎందుకు జైల్లో వేయలేకపోతున్నారని ప్రశ్నించారు. త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న అరాచకాలను ఆధారాలతో సహా బయటపెడతానని తెలిపారు.