ప్రభుత్వం మారినా ఆగని వైఎస్సార్సీపీ నేతల ఇసుక దందా - Sand Mafia police Seized vehicles - SAND MAFIA POLICE SEIZED VEHICLES
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 26, 2024, 11:49 AM IST
Sand Mafia In Nellore District Police Seized vehicles : నెల్లూరు జిల్లా సంగం వద్ద పెన్నా పరివాహక ప్రాంతంలో అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను అధికారులు సీజ్ చేశారు. స్థానికుల సమాచారంతో దాడులు నిర్వహించిన అధికారులు టిప్పర్, జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. ఇసుక రీచ్ వద్ద పని చేస్తున్న సిబ్బంది వైఎస్సార్సీపీ నేతల (YSRCP Leaders) తో చేతులు కలిపి ఇసుక రవాణా చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు సమాచారం చేరవేయగా దాడులు చేసి వాహనాలను సీజ్ చేశారు.
ఇసుక అక్రమ తరలింపుల కట్టడి చర్యలు జరుగుతున్నప్పటికీ ఇసుకాసుల తీరు మార్చుకోవడం లేదు. అధికారుల చేతికి పదుల సంఖ్యలో ఇసుక టిప్పర్లు చిక్కుతున్నా, ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. వైఎస్సార్సీపీ నాయకులతో కుమ్మక్కై పెన్నా ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడులు జరిపి వాహనాలను సీజ్ చేశారు.