ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

డమ్మీ తుపాకీతో డేంజర్​ రౌడీ- ఆటకట్టించిన విశాఖ పోలీసులు - రౌడీ షీటర్​ అరెస్ట్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 2, 2024, 8:06 PM IST

Rowdy Sheeter Among Two Arrested at One Town Visakhapatnam : డమ్మీ తుపాకీతో బెదిరించి దోపిడీకి పాల్పడిన నిందితులను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 13వ తేదీ అర్ధరాత్రి పంజాబ్ కూడలిలో పవన్ కుమార్ బైకుపై వెళ్తుండగా అదే ప్రాంతానికి చెందిన రౌడీషీటర్లు (Rowdy Sheeter) అడ్డగించారు. డమ్మీ తుపాకీతో బెదిరించి దాడి చేసి ఐఫోన్, 2వేల 500 రూపాయలు నగదు తీసుకొని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు చేపలరేవు ప్రాంతంలో ధోని సతీష్ అలియాస్ గసగసలు, మనోజ్ కుమార్​ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు (remand) తరలించారు. వారి దగ్గర నుంచి డమ్మీ తుపాకీ, 12 సెల్ ఫోన్లు, 2వేల500 రూపాయల నగదు, బైకు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు (Police) తెలిపిన వివరాల ప్రకారం ఇతనిపై 20ఏళ్లకే అతనిపై రౌడీషీటు నమోదైంది. దొంగతనాలు, బెదిరింపులు, గంజాయి రవాణా, అత్యాచారాల్లో నిందితుడిగా ఉన్నాడు. 2022లో గంజాయి కేసులో అరెస్టై 2023లో జైలు నుంచి విడుదలయ్యాడు. మళ్లీ నేరాలు చేయడం ప్రారంభించాడు. ఇతనిపై ఒకటో పట్టణ పోలీస్టేషన్లో నాలుగు అరెస్టు వారెంట్లు, మహారాణిపేటలో ఒక అరెస్టు వారెంటు పెండింగ్​లో ఉన్నాయి. ఇతనిపై ఇప్పటికే మొత్తం 30 కేసులు నమోదై ఉన్నాయని డీసీపీ తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details