విషాదం నింపిన విహార యాత్ర - కారు బోల్తా పడి తల్లీకుమారుడు మృతి 'బోలాపడిన బస్సు' - bus accident tirupati
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 22, 2024, 1:15 PM IST
Road Accident Satyasai District : విహారయాత్ర ఓ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన తులసమ్మ, ఆమె కుమారుడు పార్థసారథి కుటుంబంతో కలిసి కంచికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. పెనుగొండ రోడ్డు వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడటం వల్ల తల్లి కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. పార్థసారథి భార్యతో పాటు తన ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలు కావటంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రులను అనంతపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చోసుకొని దర్యాప్తు చేపట్టారు.
Road Accident in Tirupati : ఇదే తరహాలోనే తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని భాకరాపేట కర్మ రహదారిలో పెను ప్రమాదం తప్పింది. అనంతపురం నుంచి చెన్నైకి వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు భాకరాపేట కనుమ రహదారిలో అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మందికి తీవ్రగాయాలు కాగా, మరో 15 మందికి స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.