తాడేపల్లిలో భరతమాత విగ్రహం- పునః ప్రతిష్టించిన ఆర్‌ఎస్‌ఎస్ నేతలు - Bharat Mata Statue in Tadepalli - BHARAT MATA STATUE IN TADEPALLI
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 15, 2024, 5:51 PM IST
Re Installation of Bharat Mata Statue in Tadepalli: గుంటూరు జిల్లా తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసానికి వెళ్లే దారిలో రహదారి విస్తరణ పేరుతో తొలగించిన భరతమాత విగ్రహాన్ని పునః ప్రతిష్టించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తాడేపల్లికి చెందిన ఆర్‌ఎస్‌ఎస్ నేతలు, దాతలు 3 లక్షల రూపాయలతో విగ్రహాన్ని కొనుగోలు చేసి పునః ప్రతిష్టించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారి విస్తరణ పేరుతో భరతమాత విగ్రహాన్ని తొలగించారు. ఐదేళ్లైన విగ్రహాన్ని పునఃప్రతిష్టించకపోవడంతో స్థానికులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. తాడేపల్లిలో ప్రతిష్టించిన భారత మాత విగ్రహాన్ని తాళ్లయిపాలెం శైవ క్షేత్ర పీఠాధిపతి శివ స్వామి ఆవిష్కరించారు. ఈ క్రమంలో శైవ క్షేత్ర పీఠాధిపతి శివ స్వామి మాట్లాడుతూ స్వాంత్ర్యం దినోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్న ఈ రోజున రాష్ట్ర రాజధాని ప్రాతం అయిన తాడేపల్లిలో భరతమాత విగ్రహం ఆవిష్కరించం సంతోషకరంగా ఉందని అన్నారు. ఇలానే రాష్ట్రం అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్లాలని అన్నారు.