ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారం కోరుతూ పురందేశ్వరిని కలిసిన డీలర్లు - Ration Dealers Meet Purandeshwari

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 30, 2024, 8:16 PM IST

Ration Dealers Meet BJP State President BJP Purandeshwari: రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించేందుకు బీజేపీ మద్దతు కోరుతూ రేషన్ డీలర్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని కలిశారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షుడు మాధవరావు పురందేశ్వరికి అందజేశారు. ఈ సందర్భంగా మాధవరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తున్నా ప్రధాని ఫొటో కూడా మొబైల్ వ్యాన్​పై డిస్​ప్లే చేయడం లేదని అన్నారు. 

కనీసం వ్యాన్​పై కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యంగా ఎక్కడా ప్రజలకు తెలియని పరిస్ధితి ఉందన్నారు. మొబైల్ వ్యాన్​పై 60 శాతం స్పేస్ కేటాయించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇస్తున్న బియ్యంగా ప్రచారం కల్పించాల్సిన అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని రేషన్ డీలర్లు పేర్కొన్నారు. మొబైల్ బియ్యం పంపిణీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఉద్యమంలో భాగంగా బీజేపీ సహకారాన్ని అర్ధిస్తూ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షురాలిని కలిసామన్నారు. 

ABOUT THE AUTHOR

...view details