ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: రాజ్యసభ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - Rajya Sabha Session LIVE - RAJYA SABHA SESSION LIVE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 1, 2024, 11:01 AM IST

Updated : Jul 1, 2024, 1:19 PM IST

Rajya Sabha Session LIVE : నీట్‌ యూజీ-2024 (NEET UG-2024) పేపర్‌ లీకేజీ వ్యవహారం పార్లమెంట్​ ఉభయసభల్లో అగ్గి రాజేస్తోంది. ఈ అంశంపై చర్చ జరపాలన్న విపక్షాల డిమాండ్‌ నేపథ్యంలో గందరగోళం తలెత్తింది. దీంతో సభ నేటికి (జులై 1 సోమవారానికి) వాయిదా పడింది. ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge), ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ (Jagdeep Dhankhar) పరస్పరం ఘాటు విమర్శలు చేసుకున్నారు. ప్రతిపక్షంపై ఛైర్మన్‌ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. నీట్‌పై చర్చ కోరుతూ తొలుత ఖర్గే, ప్రతిపక్ష సభ్యులతో కలిసి వెల్‌లోకి దూసుకెళ్లారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన ధన్‌ఖడ్‌, ఇప్పటి వరకు ప్రతిపక్ష నేత స్థాయిలో ఉన్న వ్యక్తులెవరూ వెల్‌లోకి రాలేదని, ఈ పరిస్థితులను చూస్తే చాలా బాధేస్తోందని అన్నారు.  నీట్‌ పేపర్‌ లీక్‌, అగ్నిపథ్‌, ద్రవ్యోల్బణం వంటి అంశాలతో ఈరోజు నుంచి పార్లమెంటు సమావేశాలు అట్టుడుకుతున్నాయి. ప్రతిపక్షాలు పేపర్‌ లీక్‌తో పాటు నిరుద్యోగం అంశాన్ని లేవనెత్తాయి. గత వారం వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన నీట్‌-యూజీ ప్రవేశ పరీక్షలో అవకతవకలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుపడటంతో పార్లమెంటు ఉభయ సభలు ఈరోజుకు వాయిదా పడ్డాయి. తిరిగి ఇవాళ కొనసాగుతున్నాయి. రాజ్యసభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం మీకోసం 
Last Updated : Jul 1, 2024, 1:19 PM IST

ABOUT THE AUTHOR

...view details