అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఎల్బీనగర్లో ఘనంగా ప్రత్యేక పూజలు - Pooja in Chithra layout Colony
Published : Jan 22, 2024, 7:13 PM IST
Pooja on Occasion Of Ayodhya in LB Nagar : అయోధ్యలో జరుగుతున్న బాలరాముని ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ఎల్బీనగర్ పరిధిలోని చిత్ర లేఅవుట్ కాలనీ వాసులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ నేపథ్యంలో కాలనీ వాసులు పెద్ద ఎత్తున చేరుకొని అయోధ్యలో జరిగే శ్రీరామ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని ఎల్ఈడీ స్క్రీన్(LED Screen) ద్వారా తిలకించారు. శ్రీరాముడికి అభిషేకంతో పాటు అష్టోత్తరం వంటి ప్రత్యేక పూజలు చేశారు.
Sri Rama Shobha Yatra in LB Nagar : ఐదు వందల సంవత్సరాల తర్వాత అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరగడం సంతోషకరమని చిత్ర లేఅవుట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పెండ్యాల నగేశ్ అన్నారు. ఈ సందర్భంగా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. సాయంత్రం కాలనీ పరిసరాల్లో శ్రీరాముని శోభాయాత్ర నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కాలనీ వాసులంతా కులామతాలకు అతీతంగా పూజలో పాల్గొన్నారని తెలిపారు.