ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఏం ఐడియా సామీ - ప్లాస్టర్ సాయంతో గంజాయి దేహానికి అతికించుకుని - Police Seized 22 kilos Ganja - POLICE SEIZED 22 KILOS GANJA

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 6, 2024, 3:40 PM IST

Police Seized Ganja at Andhra Odissa Border: గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ స్మగ్లర్లు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటూ రవాణా సాగిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణా చేయటం కోసం సినీఫక్కీలో పథకం పన్నాడు. కానీ చివరిక పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. 

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఆంధ్రా- ఒడిశా సరిహద్దు ప్రాంతమైన పాడువ పోలీస్ స్టేషన్ పరిధిలో బందలపుట్ బస్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని తనిఖీ చేయగా అతని ట్రాలీ బ్యాగులో 15 కిలోలు గంజాయి బయటపడింది. అనంతరం ఆ వ్యక్తిని తనిఖీ చేసిన పోలీసులు అవాక్కయారు. తన దేహానికి చుట్టూ ప్లాస్టర్​ సహాయంతో 7 కిలోలు గంజాయి అతికించుకుని ఉండడం చూసి పోలీసులు విస్తుపోయారు. నిందితుడు ఛత్తీస్​గఢ్​కు చెందిన మణికంఠగా పోలీసులు తెలిపారు. నిందితున్ని అదుపులోకి తీసుకొని కోర్టుకు తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు. గంజాయి చెన్నైకి తరలించి అధిక ధరకు విక్రయించడానికే ఈ ప్రణాళిక రచించినట్టు నిందితుడు విచారణలో తెలిపాడని పోలీసులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details