అనంతపురంలో 144 సెక్షన్- సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల నిఘా - Police monitoring With Drone - POLICE MONITORING WITH DRONE
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 30, 2024, 2:59 PM IST
Police Officers monitoring With Drone Cameras in Anantapur District : రాష్ట్రంలో జూన్ 4న జరిగే ఎన్నికల కౌంటింగ్‌కు పోలీసు అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా అనంతపురం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ను పోలీసు అధికారులు అమలు చేస్తున్నారు. సమస్యాత్మక గ్రామాల్లో పర్యవేక్షణ చేస్తున్నారు.
పోలీసు అధికారులు కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించి గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసు డ్రోన్ కెమెరాలతో ఆయా ప్రాంతాల్లో పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో పలు ప్రాంతాల్లో అల్లర్లు, రాళ్ల దాడులు జరిగిన సంఘటనలు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ గౌతమిశాలి తెలిపారు. జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఎక్కడ ప్రజలు గుమిగుడి ఉండకూడదని సూచించారు. ఎన్నికల కౌంటింగ్ రోజున అల్లర్లు, దాడులు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చారించారు.