నాలుగు రోజులుగా ఒకేచోట ఉన్న సంధ్య ఆక్వా బస్సులో తనిఖీలు- ఫైల్స్, కంప్యూటర్ పరికరాలు స్వాధీనం - CHECKINGS IN SANDHYA AQUA BUS - CHECKINGS IN SANDHYA AQUA BUS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 24, 2024, 4:10 PM IST
Police Checks on Bus Belonging to Sandhya Aqua Industry: కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం మూలపేట సెజ్ కాలనీలో ఉన్న సంధ్య ఆక్వా పరిశ్రమకు సంభందించిన బస్సులో పోలీసులు తనిఖీలు చేశారు. నాలుగు రోజులుగా అక్కడే సంధ్య అక్వా పరిశ్రమ బస్సు ఉంది. ఇటీవల విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ కంటైనర్ సంధ్య ఆక్వా పరిశ్రమ పేరుతో బుక్ అయి ఉండటంతో చర్చనీయాంశమైంది. దీంతో సంధ్య పరిశ్రమకు చెందిన బస్సు మూలపేట సెజ్ కాలనీలో ఉండటంతో స్థానికులు ఆందోళన చెందారు. బస్సు ఎవరు అక్కడ పెట్టారో అందులో ఏముందో తెలియక పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటా హుటిన బస్సు ఉన్న ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు. బస్సు తాళాలు తీసి తనిఖీలు చేశారు. బస్సులో ఉన్న బాక్సులు పరిశీలించి వాటిలో కొన్ని రికార్డ్ లు, కొన్ని కంప్యూటర్ పరికరాలు, ఫైల్స్, నూతన చెక్ బుక్కులు, మిషనరీ సామాగ్రి ఉన్నట్లు గుర్తించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.