ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఆర్టీసీ డ్రైవర్​పై పోలీసుల దాడి ! - వైసీపీ ప్రోద్భలంతోనేనని బాధితుడి ఆవేదన - Attack on RTC driver - ATTACK ON RTC DRIVER

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 31, 2024, 12:54 PM IST

Police Attacked RTC Driver: శ్రీకాకుళం జిల్లా మందస మండలం బుడార్శింగిలో ఆర్టీసీ డ్రైవర్​పై దాడి కలకలం రేపుతోంది. ఏకంగా పోలీసులే ఆర్టీసీ డ్రైవ్​పై దాడి చేయడం ఆశ్చర్యం కల్గిస్తోంది. పలాస ఆర్టీసీ డిపోలో దేవరాజు ఔట్ సోర్సింగ్ డ్రైవర్, కండెక్టర్ గాను విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఉదయం కొందరు వచ్చి ఆయన్ను రక్తమొచ్చేలా కొట్టారు. 6 నెలల క్రితం వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి మారానని అప్పటి నుంచి వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల ప్రోద్బలంతోనే పోలీసులు మఫ్టీలో వచ్చి దాడి చేశారని బాధితుడు ఆరోపిస్తున్నారు. తీవ్ర గాయాలతో దేవరాజు హరిపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష బాధితుడ్ని పరామర్శించారు. దేవరాజును ఓదారుస్తూ ఆమె కంట తడి పెట్టారు. పార్టీ మారినంత మాత్రాన చంపేస్తారా అని శిరీష ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను అండగా ఉండాల్సిన పోలీసులే ఇలా దాడులకు చేస్తే సామాన్యులు తమ కష్టాలు ఇంకెవరికి చెప్పుకోవాలని నిలదీశారు. 

ABOUT THE AUTHOR

...view details