ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

చుడీదార్ ఆర్టర్ చేస్తే సగం జీన్స్ డెలివరీ - ONLINE ORDER Fraud - ONLINE ORDER FRAUD

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 17, 2024, 4:53 PM IST

Online Order Scam in Nizamabad: ఆన్​లైన్​లో చుడీదార్ ఆర్డర్​ పెడితే విచిత్రంగా సగం ప్యాంటు వచ్చిన ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా​ నవీపేట మండలం ఫతేనగర్​లో చోటుచేసుకుంది. తనకు వచ్చిన పార్శిల్​ చూసి కస్టమర్ అవాక్కయ్యారు. తాను ఒకటి పెడితో ఇంకొకటి డెలివరీ కావడమే కాకుండా సగం ప్యాంట్ రావడం చూసి షాకయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఫతేనగర్​కు చెందిన సర్ఫరాజ్ బక్రీద్​ పండుగ నేపథ్యంలో ఇంట్లో వారికి ఈ నెల 12వ తేదీన ఆన్​లైన్​లో సల్వార్ కమీజ్ (పంజాబీ డ్రెస్) ఆర్డర్​ పెట్టాడు. ఆదివారం సదరు కంపెనీ డెలివరీ బాయ్​ ఆర్డర్​ బాక్సును సర్ఫరాజ్​కు అందిచాడు. రూ.413 చెల్లించి చూస్తే తీరా సగం ప్యాంటు రావడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఒకటి ఆర్డర్ ​పెడితే మరొకటి వచ్చిందని, అందులోనూ సగం ప్యాంటు రావడంపై బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ తతంగమంతా డెలివరీ బాయ్ ఉన్నప్పుడే జరగడం గమనార్హం. 

అయితే సగం ప్యాంట్ రావడమే కాదు తాను ఆర్డర్​ చేసినప్పటి నుంచి షిప్పింగ్, డెలివరీ డేట్, డెలివరీ కంప్లీటెడ్ అలా ఏ అప్డేట్ తనకు రాలేదని సదరు కస్టమర్ వాపోయాడు. అలా అప్డేట్స్ ఏం రాకుండా ఎలా గూడ్స్ డెలవరీ చేస్తారని మండిపడ్డాడు. ఫేక్​ డెలివరీ కంపెనీలు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారంటూ బాధితుడు ఆరోపించాడు. ఈ ఆన్​లైన్​ మోసంపై సదరు వ్యక్తి నవీపేట పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు.  

ABOUT THE AUTHOR

...view details