విజయవాడలో వర్షంతో ప్రజలు అవస్థలు - కాలువలను తలపిస్తున్న కాలనీలు - PEOPLE SUFFER WITH HEAVY RAIN - PEOPLE SUFFER WITH HEAVY RAIN
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 15, 2024, 7:44 PM IST
People Suffering From Heavy Rains in Vijayawada: విజయవాడలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరంలోని పలు కాలనీలు కాలువలను తలపిస్తున్నాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జోరుగా కురుస్తున్న వర్షంతో నగర వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయింది. దీంతో రోడ్లపై వెళ్లేందుకు వాహనదారులు అవస్థలు పడుతున్నారు. విద్యార్థులు సైతం స్కూల్‌కి వెళ్లేందుకు వర్షంలో అవస్థలు పడ్డారు.
ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. వర్షపు నీరు నిల్వ కారణంగా రోగాలు వచ్చే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత ప్రభుత్వం డైనేజీ వ్యవస్థను సక్రమంగా పూర్తి చేయకపోవడంతో రోడ్లపైనే వర్షపు నీరు నిలిచిపోయింది. ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఉందో తెలియక ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని రాకపోకలు సాగిస్తున్నారు. రోడ్డుపై కారు ప్రయాణిస్తుంటే చిన్న పడవ వచ్చినట్టుగా అనిపిస్తుంది. మున్సిపల్ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. విజయవాడలో వర్షం ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.