ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

నూజివీడులో వర్ష బీభత్సం- సర్వం కోల్పోయామంటున్న స్థానికులు - Flood Effect in Eluru

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 1, 2024, 2:57 PM IST

People Suffer Due to Flood Effect in Eluru District : ఏలూరు జిల్లాలో వర్షం విధ్వంసం సృష్టించింది. పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. వాగులు, వంకలు, కాలువలు పొంగిపొర్లాయి. భారీ వర్షంతో వీధుల్లోకి నీరు చేరి జనం అవస్థలు పడ్డారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెద్దచెరువుకు కనకదుర్గమ్మ ఆలయ సమీపంలో గండి పడింది. దీంతో సమీపంలో ఇళ్లు ముంపుకు గురైంది. ఇళ్ల లోపలకి నీరు చేరడంతో చాలా మంది నిరాశ్రయులుగా మిగిలారు. 

Heavy Rains in Nuziveedu : దీంతో అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు శనివారం తరలించారు. ఆదివారం ఉదయం వచ్చే సరికి తమ ఇళ్లులో నిత్యావసర సరకులు చెల్లాచెదురయ్యారని బాధితులు కన్నీర్లు పెట్టుకున్నారు. వరద ధాటికి తాము సర్వం కోల్పోయమని ఆవేదన వ్యక్తం చేశారు. తమల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుకుంటున్నారు. మరోవైపు ఊటవాగు, రామిలేరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో నూజివీడు నుంచి విస్సన్నపేట, ముసునూరు వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.

ABOUT THE AUTHOR

...view details