ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అనంతపురానికి కూలీనే- బాధ్యతలు చేపట్టాక జిల్లాకు వచ్చిన పయ్యావులకు బ్రహ్మరథం - People Welcome to Payyavula Keshav - PEOPLE WELCOME TO PAYYAVULA KESHAV

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 17, 2024, 4:39 PM IST

People Gave a Warm Welcome to Minister Payyavula Keshav: రాష్ట్రానికి తాను మంత్రి నైనా అనంతపురం జిల్లాకు కూలీనేనని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా అనంతపురం జిల్లాకు వచ్చిన పయ్యావుల కేశవ్​కు తెలుగుదేశం ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు. జిల్లా సరిహద్దులోని బాట సుంకులమ్మ ఆలయంలో టీడీపీ నేతలతో కలసి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి అక్కడి నుంచి ఉరవకొండ వరకు ర్యాలీగా వెళ్లారు. గుత్తిలో రోడ్ షో నిర్వహించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 

మంత్రులంతా రాష్ట్ర అభివృద్ధి కోసం కచ్చితంగా పని చేసి చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని కేశవ్​ తెలిపారు. ప్రజలు, చంద్రబాబు తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకొని ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. జిల్లాలో సమస్యలను బాగా తెలిసిన వాడినని నీటి కోసం ఎన్నో ఉద్యమాలు చేశానని మంత్రి అన్నారు. సమస్యలు తీర్చడమే తన లక్ష్యంగా ముందుకు వెళ్తానని కేశవ్ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details