ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అక్షర యోధుడుకి పెదపారుపూడి ఘన నివాళి- స్వగ్రామంలో రామోజీరావు విగ్రహం - Tribute to Ramoji Rao - TRIBUTE TO RAMOJI RAO

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 18, 2024, 12:37 PM IST

Tribute to Ramoji Rao : రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు స్వగ్రామమైన కృష్ణా జిల్లా పెదపారుపూడిలో గ్రామస్థులు ఘనంగా నివాళులు అర్పించారు. రామోజీరావు జన్మస్థలానికి 25 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశారని గ్రామస్థులంతా గుర్తు చేసుకున్నారు. స్నేహశీలి, మృదుస్వభావి అయిన రామోజీరావు మన మధ్య లేకపోవడం తీరని లోటు అని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ కార్యక్రమంలో పాల్గొని రామోజీ చిత్రపటానికి నివాళి అర్పించారు.

రామోజీరావు గుర్తుగా గ్రామంలో ద్వారము, ఆయన విగ్రహము ఏర్పాటు చేయుటకు గ్రామస్తులందరూ ఏకీభవించారని త్వరలోనే వాటి పనులు మొదలపెడతామని తెలియజేశారు. రామోజీరావు ఒక వ్యక్తి కాదని మహాశక్తి అని వారు కొనియాడారు. భావితరాల అభివృద్ధి కోసం సమాజంలో జరిగే చెడుపై పోరాటం చేశారని, ఆయన అభివృద్ధి కాకుండా ప్రతి వ్యక్తి అభివృద్ధి చెందాలని మానవతా దృక్పథంతో ఉండేవారని గుర్తు చేశారు. ఆయన చేసే ప్రతి పని ఒక నిబద్ధతతో ఉండేదని, ప్రతి వ్యక్తికి ఒక రోల్ మోడల్​గా నిలిచారని అన్నారు.  తన వద్ద చేసే ఉద్యోగులను కూడా అభివృద్ధి చెందాలని నిరంతరం హితబోధ చేస్తూ ఉండేవారని తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details