LIVE పోలవరం కొయ్యలగూడెంలో పవన్ కల్యాణ్ 'వారాహి విజయ భేరీ' సభ - ప్రత్యక్షప్రసారం - VARAHI VIJAYABHERI SABHA LIVE - VARAHI VIJAYABHERI SABHA LIVE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 30, 2024, 6:34 PM IST
|Updated : Apr 30, 2024, 8:09 PM IST
Pawan Kalyan Varahi Vijayabheri Sabha Live in Koyyalagudem of eluru district : రాష్ట్రప్రజల కోసం తానొక కూలీలా పని చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వైఎస్సార్సీపీ ఒక అరటి పండు తొక్క ప్రభుత్వమనని ఎద్దేవా చేశారు. యువతకు దిశానిర్దేశం చేసి వారిలో ఉన్న శక్తిని బయటకు తీస్తామని హామీ ఇచ్చారు. సగటు మనిషి గొంతును అసెంబ్లీలో వినిపిస్తానని ప్రజలకు పవన్ భరోసానిచ్చారు. రోడ్లు బాగు చేసి సాగు, తాగునీటి సమస్య పరిష్కరిస్తామన్నారు. పోలవరం కాల్వల మట్టిని వైఎస్సార్సీపీ నాయకులు దోచేస్తున్నారని పవన్ ధ్వజమెత్తారు. కాల్వ గట్లను సైతం వదలట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఇంత జరుగుతున్నా జలవనరులశాఖ ఏం చేయలేకపోతోందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ నాయకులు వందల ఎకరాల్లో చెరువులు కబ్జా చేశారన్న పవన్ కొండను కూడా మిగలకుండా చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాగా నేడు ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెంలో వారాహి విజయ భేరి సభ నిర్వహించనున్నారు. ఈ ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : Apr 30, 2024, 8:09 PM IST