LIVE : మీడియాతో మాట్లాడుతున్న ప్రధాని మోదీ - PARLIAMENT BUDGET SESSIONS LIVE
Published : Jan 31, 2025, 10:26 AM IST
|Updated : Jan 31, 2025, 10:32 AM IST
Parliament Budget Sessions Live : ఇవాళ్టి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. అంతకు ముందు ప్రధాని మోదీ ప్రసంగించారు. 2024-25 ఆర్థిక సర్వేను సభలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్నారు. అలాగే రేపు పార్లమెంటు ముందుకు వార్షిక బడ్జెట్ రానుంది. ఆ వార్షిక బడ్జెట్ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో 16 బిల్లులు ప్రవేశపెట్టే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. వక్ఫ్ చట్టసవరణ బిల్లు, ఇమ్మిగ్రేషన్, ఫారినర్ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. మహా కుంభ మేళాలో తొక్కిసలాటపై చర్చకు విపక్షాలు పట్టుపట్టనున్నాయి. నిరుద్యోగం, రైతుల దుస్థితి అంశాలపై కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తామని చెప్పింది. సమావేశాల అజెండాను బీఏసీ నిర్ణయిస్తుందని కేంద్రం తెలిపింది. రెండు విడతల్లో జరగనున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత సమావేశాలు జరగనున్నాయి. ఆ తర్వాత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలపై దేశం మొత్తం ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలోనే సమావేశాలకు ముందు ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడుతున్నారు.
Last Updated : Jan 31, 2025, 10:32 AM IST