ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తెలుగుదేశం కార్యకర్తకి ఎమ్మెల్యే బహుమతి - PAMARRU MLA GIFTED TO TDP ACTIVIST

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2024, 5:55 PM IST

MLA  gifted to Telugu Desam activist : కృష్ణా జిల్లా కోసూరులో ఆర్థికంగా వెనుకబడిన వ్యక్తి జీవనోపాధికి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని ఒక ఆటోని పామర్రు శాసనసభ్యులు కుమార్ రాజా బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ ప్రతి ఒక్కరికీ జీవనోపాధిని కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని స్ఫష్టం చేశారు. 

ఇది మంచి ప్రభుత్వమని ఈ కార్యక్రమంలో ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకి చేదోడు వాదోడుగా ఉంటుందని దానికి ఇదే నిదర్శనం అని ఆయన వెల్లడించారు. కోసూరులో అందరికీ చేయూతను అందించడంలో తెలుగుదేశం పార్టీ ముందు ఉందని పార్టీ నాయకులతో ముందుకొచ్చి కార్యకర్తకి ఆటోను తన చేతుల మీదుగా అందజేయటం ఎంతో సంతోషకరమని తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకి అండగా ఉంటుందని తెలియజేశారు. ఆటోను అందుకున్న తెలుగుదేశం కార్యకర్త తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.  ఆటోను అందించిన పామర్రు శాసన సభ్యులు కుమార్ రాజాకు వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలను తెలియజేశారు. ఇది అందరూ మెచ్చిన ప్రభుత్వమని వారు కొనియాడారు.  

ABOUT THE AUTHOR

...view details