ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

హెల్మెట్ ధరించటం మనందరి బాధ్యత: సినీనటుడు రఘుబాబు - Helmet Awareness Program - HELMET AWARENESS PROGRAM

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 28, 2024, 9:16 AM IST

Updated : Aug 28, 2024, 11:49 AM IST

Ongole Police Conduct Helmet Awareness Program in Prakasam District : బైక్‌ను నడిపేటప్పుడు హెల్మెట్ ధరించటం మనందరి బాధ్యత అని ప్రముఖ సినీ నటుడు రఘుబాబు అన్నారు. హెల్మెట్ వాడకం, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ ఏఆర్​ దామోదర్‌తో కలిసి నగరంలో బైక్​ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఒంగోలు మినీ స్టేడియంలో వివిధ కళాశాల విద్యార్థులకు హెల్మెట్ వినియోగం, ట్రాఫిక్ నిబంధనల పాటించటం, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవగాహన కల్పించారు. 

ప్రమాదం ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుందని, మనందరం తప్పనిసరిగా ట్రాఫిక్‌ నిబంధనలను పాటించాలని రఘుబాబు కోరారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందిన వారిలో యువత సంఖ్యే ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు తనతో పాటు తోటివారు కూడా హెల్మెట్​ ధరించేలా చూడాలని హితవు పలికారు

Last Updated : Aug 28, 2024, 11:49 AM IST

ABOUT THE AUTHOR

...view details