కారుకు పూజ చేయించుకుని వెళ్తుండగా ఎదురొచ్చిన మృత్యువు- ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు - Accident To Two Cars - ACCIDENT TO TWO CARS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 11, 2024, 1:06 PM IST
One Person Dead Was Car Accident in Satya Sai District : రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటన సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో జరిగింది. మండలంలోని దేమకేత్తేపల్లి సమీపంలో చౌడేశ్వరి ఆలయం వద్ద రెండు కార్లు వేగంగా ఢీకొన్నాయి. కర్ణాటకలోని శ్రీనివాసపురానికి చెందిన డ్రైవర్ మధు హిందూపురంలోని లేపాక్షి ఆలయంలో పూజలు చేయించుకుని స్కార్పియో వాహనంలో తిరిగి బెంగళూరు వైపు వెళ్తున్నారు. చిలమత్తూరు నుంచి హిందూపురం వెళుతున్న మరో కారు దాన్ని ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి.
ఈ దుర్ఘటనలో స్కార్పియో డ్రైవర్ మధు అక్కడికక్కడే మృతి చెందగా అందులోనే ఉన్న గిరిధర్, శ్రీనివాసు తీవ్రంగా గాయపడ్డారు. కారులో ఇరుక్కున్న వారిని స్థానికులు అతి కష్టం మీద బయటకు తీశారు. క్షతగాత్రులను చికిత్స కోసం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించారు. రెండు వాహనాలు అతివేగంగా రావడంతోనే అదుపుతప్పి ఢీకొన్నట్లు తెలుస్తోంది.