డొక్కు బస్సులతో ప్రయాణికుల ఇక్కట్లు - శిక్ష డ్రైవర్కా! - RTC Bus Rain Driver - RTC BUS RAIN DRIVER
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 23, 2024, 10:13 AM IST
Officers Harassed RTC Bus Rain Driver in Kakinada District : ఇటీవల గుంటూరు నుంచి కాకినాడ వస్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ టాప్ నుంచి వర్షం నీరు లీకై డ్రైవర్‌తో పాటు ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. డ్రైవర్ తడిసి ముద్దవడంతో పాటు ఇంజిన్‌పై నీరు పడింది. ఈ క్రమంలో ఆర్టీసీ తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్‌లో కథనాలు వచ్చాయి. ఈ విషయం డ్రైవర్ వెంకటేశ్వర్లు కారణంగానే బయటకు వచ్చిందని భావించిన ఆర్టీసీ అధికారులు అతనిపై ప్రతీకార చర్యలకు పూనుకున్నారు. ఆయనను బస్సు నడిపే విధుల నుంచి తప్పించి కాకినాడ జీజీహెచ్ బల్టర్ వద్ద స్పేర్ ఉద్యోగిగా నియమించారు.
బస్‌స్టాండ్ ముందు నిలబడి అక్కడకు వచ్చే బస్సుల్లో ప్రయాణికులను ఎక్కించడం వంటి పనులు అప్పగించారు. డొక్కు బస్సులతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోవడం మానేసి డిపో అధికారులు సీనియర్ డ్రైవర్‌పై వేధింపులకు దిగడం ఆర్టీసీలో చర్చనీయాంశమైంది. భవిష్యత్తులో ఆ డ్రైవర్‌కు ఎలాంటి విధులు అప్పగిస్తారోనని సహచర ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.