ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కూటమి విజయంతో ప్రవాసాంధ్రుల సంబరాలు - 125 కార్లతో విజయోత్సవ ర్యాలీ - NRI Celebrations in America - NRI CELEBRATIONS IN AMERICA

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 23, 2024, 12:18 PM IST

Celebrations in America on Alliance Grand Victory: రాష్ట్రంలో కూటమి అఖండ విజయం సాధించటంతో ప్రవాసాంధ్రులు సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంపై ఎన్‌ఆర్‌ఐలు సంతోషం వ్యక్తం చేశారు. ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో అమెరికాలోని నార్త్ కరోలినా ఛార్లెట్​లో ఈ సంబరాలు జరిగాయి. 125 కార్లతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించి తెలుగుదేశం, జనసేన జెండాలు రెపరెపలాడించారు. కార్యక్రమానికి వెయ్యి మందికిపైగా కూటమి అభిమానులు హాజరయ్యారు. కూటమి తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఎన్‌ఆర్‌ఐ నేతలను ప్రవాసాంధ్రులు అభినందించారు. 

ఎన్‌ఆర్‌ఐలుగా రాష్ట్రానికి సేవలందించటంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థుల విజయం కోసం అమెరికా నుంచి రాష్ట్రానికి వచ్చి తాము చేసిన ప్రచారాన్ని ఎన్‌ఆర్‌ఐలు గుర్తుచేసుకున్నారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. కొంత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు వీడియోల ద్వారా తమ సందేశాన్ని పంపించారు. మరికొంతమంది జూమ్ మీటింగ్ ద్వారా ఎన్‌ఆర్‌ఐలతో మాట్లాడారు. రాష్ట్ర ప్రగతికి, అభివృద్ధికి ప్రవాసాంధ్రులు కృషి చేయాలని కోరారు. కూటమి విజయం కోసం ఎన్‌ఆర్‌ఐలు పడిన కష్టాన్ని, చేసిన సాయాన్ని మరువలేమన్నారు. అక్షర యోధుడు రామోజీరావు మృతికి ప్రవాసాంధ్రులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.

ABOUT THE AUTHOR

...view details