ఎన్నికల కోడ్ వస్తోంది- ఇకపై తిరుమలలో వీఐపీ దర్శనాలు బంద్! - తిరుమలలో వీఐపీ దర్శనాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 2, 2024, 4:34 PM IST
No Special Tickets in TTD : త్వరలో ఎన్నికల కోడ్ వెలువడనున్న సందర్భంగా తిరుమలలో వీఐపీ (VIP) దర్శనాలు నిలిపివేస్తున్నట్లు టీటీడీ (Tirumala Tirupati Devastanam) ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వాటి స్థానంలో ఎస్ఎస్డీ (Slotted Sarva Darshan ) టోకెన్లు అమలు చేస్తామని ప్రకటించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలో వేసవి నుంచి సర్వదర్శన టోకెన్లను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
TTD EO Dharma Reddy In Dial Your EO Program : స్వామివారి లడ్డూల ధరలను తగ్గించాలని భక్తులు కోరినట్లు ఈవో (EO) ధర్మారెడ్డి తెలిపారు. ఇప్పటికే ఆలయంలో ఒక ఉచిత లడ్డూ, స్వామివారిని దర్శన అనంతరం ఒక ప్రసాదం లడ్డు భక్తులకు ఇస్తున్నామని, అన్నప్రసాదం పెడుతున్నామని సాధ్యం కాదని భక్తులకు తెలిపినట్లు ఈవో ధర్మారెడ్డి చెప్పారు. ఫిబ్రవరి నెలలో నమోదు అయిన భక్తుల వివరాలను వివరించారు. గత నెలలో శ్రీవారిని 19.06 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారన్నారు. హుండీ కానుకల ద్వారా రూ.111.71 కోట్లు లభించిందన్నారు. 95.43 లక్షల లడ్డు విక్రయాలు జరిగాయన్నారు. అన్నప్రసాదం 43.61 లక్షల మంది స్వీకరించారాన్నారు.