ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'ఆదాల ప్రభాకర్ రెడ్డి నా కుటుంబాన్ని చిద్రం చేయాలని చూశారు' - ఎమ్మెల్యే కోటంరెడ్డి - Nellore Rural MLA Press Meet - NELLORE RURAL MLA PRESS MEET

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 21, 2024, 10:43 AM IST

Nellore Rural MLA Kotamreddy Sridhar Reddy Press Meet : నెల్లూరు రూరల్ వైఎస్సార్సీపీ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే (MLA) కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో తమ కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆయన ఆరోపించారు. తమ ఇద్దరు కుమార్తెలు, భార్య వాట్సాప్ నంబర్లకు అసభ్యంగా పోస్టులు పెట్టించి మానసిక క్షోభకు గురిచేశారని కోటంరెడ్డి కన్నీరు పెట్టుకున్నారు.

తనను వ్యక్తిగతంగా, మానసికంగా హింసించారని, రూ.2కోట్లు పెట్టి దుష్ప్రచారం చేశారని, తన కుటుంబాన్ని చిద్రం చేయాలని చూశారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. గురువారం నెల్లూరులోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అన్ని శక్తులు ఒక్కటై ఇరికించాలనుకున్నారని, రాజకీయంగా బూడిద చేస్తామన్నారని, కానీ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని తాను ఎమ్మెల్యేగా గెలిచి ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు తెలిపారు. ప్రమాణ స్వీకారం తర్వాత అన్ని శాఖల మంత్రులను కలిసి రూరల్ నియో జకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details