ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'ల్యాండ్ టైటిలింగ్ చట్టమా జే గ్యాంగ్ చట్టమా?- నీతి అయోగ్​ చట్టంతో పొంతనే లేదు' - NDA Leaders on Land Titling Act

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 7, 2024, 3:02 PM IST

NDA Leaders Comments on Land Titling Act in Mangalagiri : నీతి ఆయోగ్ రూపొందించిన ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి వైఎస్సార్సీపీ రూపొందించిన చట్టానికి పొంతన లేదని ఎన్డీఏ (NDA) నేతలు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో నేతలు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం జే గ్యాంగ్ చట్టంలా ఉందని నేతలు ఆరోపించారు. ప్రజల ఆస్తులకు సంబంధించిన పత్రాలపై జగన్ చిత్రం ఏంటని నేతలు ప్రశ్నించారు. ఈ చట్టం నుంచి ప్రజలను రక్షించాలంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందున్నారు.      

వైఎస్సార్సీపీ తెచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ రాష్ట్రంలోని ప్రజల భూములను కొట్టేసేలా ఉందని కూటమి నేతలు ఆరోపించారు. నీతి ఆయోగ్ చట్టానికి ఈ చట్టానికి చాలా తేడాలున్నాయన్నారు. ప్రజల ఆస్తులకు సంబంధించిన పత్రాలపై జగన్ ఫొటో వేసుకోమని నీతి ఆయోగ్ చట్టం చెప్పిందా అని బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ ధ్వజమెత్తారు. అన్ని రాష్ట్రాల్లో ఈ చట్టం ఉందని అబద్దాలతో ప్రజల్లోకి ఈ చట్టాన్ని తీసుకెళ్లానుకోవడం మూర్ఖత్వం అని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details