ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

విజయవాడ అభివృద్ధికి ప్రత్యేక మేనిఫెస్టో - ఎన్డీయే కూటమి నేతల సమావేశంలో వెల్లడి - NDA Alliance Parliamentary Meeting - NDA ALLIANCE PARLIAMENTARY MEETING

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 5, 2024, 3:25 PM IST

NDA Alliance Parliamentary Meeting in Vijayawada: విజయవాడ పార్లమెంట్ సమస్యలపై ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తామని తెలుగుదేశం అభ్యర్థి కేశినేని చిన్ని తెలిపారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్లమెంటు స్థాయి సమన్వయ సమావేశాల్లో భాగంగా విజయవాడలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఉమ్మడి సమన్వయ సమావేశాలు నిర్వహించారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు, ఇన్​ఛార్జ్​లు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం, పోల్ మేనేజ్​మెంట్, కూటమి అభ్యర్థుల గెలుపు కోసం సమన్వయంతో చర్చించినట్లు సుజనా చౌదరి వెల్లడించారు. రాజధానిని నాశనం చేసి ప్రాంత అభివృద్ధికి వైసీపీ తూట్లు పొడిచిందని చిన్ని అన్నారు. 

ఏడు నియోజకవర్గాల్లో బహిరంగ సభల నిర్వహణ, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం తదితర అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. విజయవాడ అభివృద్ధికి ప్రత్యేక మేనిఫెస్టో రూపొందిస్తామని వెల్లడించారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం శ్రేణులు కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు. వైసీపీ సామాజిక మాధ్యమాల్లో పెట్టే నకిలీ పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సూచించారు. 30 సంవత్సరాలు వెనకబడిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం కూటమి వల్లే సాధ్యమని రామ్మోహన్ పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details