ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: ఎంపీ గల్లా వీడ్కోలు సభ - హాజరైన నారా లోకేశ్- ప్రత్యక్ష ప్రసారం - Lokesh live

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 28, 2024, 2:09 PM IST

Updated : Jan 28, 2024, 2:43 PM IST

Nara Lokesh Live: గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనను లక్ష్యంగా చేసుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో మౌనంగా ఉండలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు. ప్రస్తుత నిర్ణయం తాత్కాలికమేనన్నారు. వనవాసం తర్వాత శ్రీరాముడు, పాండవులు వచ్చినంత బలంగా తిరిగి పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వస్తానని గల్లా జయదేవ్‌ వెల్లడించారు. ఎంపీ గల్లా జయదేవ్‌ రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నానని అన్నారు. తన పని పూర్తిగా నిర్వర్తించలేకపోతున్నాననే భావన ఉందని, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వంతో ఇబ్బందులని మౌనంగా ఉండలేనని తెలిపారు. అందుకే రాజకీయాల్లో ఉండకూడదని నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. 

మౌనంగా కూర్చోవడం నా వల్ల కాదు: రాజకీయాల్లో ఉంటే వివాదాలు వస్తున్నాయన్న గల్లా జయదేవ్‌, తాను మళ్లీ పోటీ చేసినా గెలుస్తానని కానీ పార్లమెంటులో మౌనంగా కూర్చోవడం నా వల్ల కాదని చెప్పారు. పూర్తిస్థాయి రాజకీయాల్లో కొనసాగలేనని, రాజకీయం, వ్యాపారం రెండుచోట్ల ఉండలేనన్నారు. అందుకే రాజకీయం వదిలేస్తున్నట్లు తెలిపారు. రెండేళ్ల క్రితం తన నాన్న వ్యాపారాల నుంచి రిటైర్ అయ్యారని, అప్పటి నుంచి తనకు బాధ్యత పెరిగిందని అన్నారు. తమ సంస్థల్లో 17 వేల ఉద్యోగులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

పార్టీ లైన్ ప్రకారమే మాట్లాడాలి: ఎంపీలకు ప్రత్యేక అధికారాలు లేవన్న జయదేవ్, ప్రాంతీయ పార్టీల్లో పార్టీ లైన్ ప్రకారమే మాట్లాడాలని అన్నారు. రాష్ట్ర హక్కుల కోసం పార్లమెంటులో అవిశ్వాసం వేళ తాను మాట్లాడానని గుర్తు చేశారు. దీంతో ఈడీ అధికారులు రెండుసార్లు పిలిచి విచారించారని తెలిపారు. ప్రజలు నా సేవలు గుర్తించి రెండోసారి ఎంపీగా చేశారన్న జయదేవ్‌, అమరావతి రైతులతో చలో అసెంబ్లీ నిర్వహించానని అన్నారు. ఆ సమయంలో పోలీసులు అరెస్టు చేస్తే ప్రజల కోసం జైలుకు వెళ్లానని పేర్కొన్నారు. 

గల్లా జయదేవ్​ వీడ్కోలు సభ నిర్వహించగా పలువురు నేతలు పాల్గొన్నారు. 

Last Updated : Jan 28, 2024, 2:43 PM IST

ABOUT THE AUTHOR

...view details