జగన్ మీ బిడ్డను మీ బిడ్డను అన్నప్పుడే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై డౌటొచ్చింది: నారా లోకేష్ - Nara Lokesh On Land Titling Act - NARA LOKESH ON LAND TITLING ACT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 29, 2024, 7:46 PM IST
Nara Lokesh Comments On ap Land Titling Act : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల భూములు కొట్టేసే నల్ల చట్టమని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శించారు. ప్రజల ఆస్తిపై జగన్ బొమ్మతో సర్వే రాళ్లు పడితే, ఆస్తి పట్టాపై జగన్ బొమ్మ ఉందని మండిపడ్డారు. తాజా చట్టంతో ఆస్తి ఒరిజినల్ డాక్యుమెంట్లు జగన్ దగ్గర ఉంటాయని ఆరోపించారు. మీ బిడ్డను మీ బిడ్డను అని ఊరూరా తిరుగుతూ జగన్ అంటున్నప్పుడే అనుమానం వచ్చిందన్న లోకేష్, ఇకపై జనం భూమి జగన్‌ది, జనం ఆస్తి జగన్ సొంతం అనే విషయం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చేసరికి అర్థమైందని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆస్తి మనదా ? లేక జగన్, భారతి రెడ్డిలదా ? అని లోకేష్ నిలదీశారు.
వైఎస్సార్సీపీ అనుంగులను టీఆర్వోలుగా నియమించుకుని భూములను కొట్టేసేందుకు యత్నిస్తున్నారని, వైఎస్సార్సీపీ నేతలు బ్లాక్ మనీతో కొనుగోలు చేసిన భూములను చట్టబద్దం చేసేందుకు ఈ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారని గతంలో పలువురు ఆరోపించారు.