వైఎస్సార్సీపీ బీసీలపై తప్పుడు కేసులు బనాయించింది: లోకేశ్ - LOKESH ABOUT BCS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 26, 2024, 7:30 PM IST
Nara Lokesh about Social Justice for Weaker Sections : తెలుగుదేశం పార్టీ బలహీనవర్గాలకు పుట్టినిల్లు లాంటిదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. టీడీపీ ద్వారానే బలహీన వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని లోకేశ్ వెల్లడించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏనాడు బీసీలపై దాడులు, వేధింపులు జరగలేదన్నారు.
Joinings In TDP at Vijayawada: జగన్ అధికారంలోకి వచ్చాక 26 వేలమంది బీసీలపై తప్పుడు కేసులు బనాయించారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీ రక్షణ చట్టంతో బలహీన వర్గాలకు రక్షణ కల్పిస్తామని యువ నేత హామీ ఇచ్చారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ తాడి శకుంతల లోకేశ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళగిరి శివాలయం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు వకుళాదేవి తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. అదే విధంగా కేశినేని చిన్ని నేతృత్వంలో 400 కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ నుంచి వలసలు భారీగా పుంజుకోవటంతో గెలుపు ఖాయమని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.