ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అడవి బిడ్డల మరణ ఘోషను పట్టించుకోరా ?: చంద్రబాబు - Chandrababu on boy death

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 23, 2024, 7:54 PM IST

Nara Chandrababu reaction on tribal boy death: విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం చిట్టంపాడులో ఏడాదిన్నర వయసున్న మరో చిన్నారి మృతి చెందడంపై తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు ఎక్స్​ ద్వారా స్పందించారు.  గంగమ్మ, ఆమె 6 నెలల కొడుకు మరణించి 15 రోజులు కాకముందే అదే గ్రామంలో ఏడాదిన్నర వయసున్న మరో చిన్నారి ప్రవీణ్ మృతి చెందాడన్న వార్త తన మనసును కలచి వేసిందని చంద్రబాబు పేర్కొన్నారు. అదే వ్యధ, అదే దారుణం! కొనసాగుతోందని మండిపడ్డారు. బాలుడిని ఆసుపత్రికి తీసుకు వెళ్లడానికి 7 కిలోమీటర్లు మోసుకెళ్లారని అన్నారు. ప్రవీణ్ చనిపోయాక మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి అంబులెన్స్ ఇవ్వకపోతే 3 వేలు అప్పు చేసి ప్రైవేటు వాహనంలో రైల్వే స్టేషన్ కు తెచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు.

సీఎస్​కు విన్నపం: పేదలు చనిపోతే వారి మృతదేహాలు తరలించడానికి అంబులెన్స్‌ ఇవ్వరా అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏమిటీ అమానవీయ పరిస్థితి అంటూ దుయ్యబట్టారు. ఈ పెత్తందారు ముఖ్యమంత్రికి ఎలాగూ పేదల గోడు పట్టదని, అందుకే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందించాలని కోరారు. కనీసం సీఎస్ అయినా ఆ అడవి బిడ్డల మరణ ఘోషపై సమీక్ష చేసి తగు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్‌చేశారు.  

ఇదీ జరిగింది: విజయనగరం జిల్లా శృంగవరపు కోట మండలం మూలబొడ్డవర పంచాయతీ గిరిశిఖర గ్రామానికి చెందిన ఏడాదిన్నర బాలుడు పవీణ్ ఆనారోగ్యంతో బాధపడుతుంటే కుటుంబసభ్యులు ఆదివారం ఆసుపత్రిలో చేర్చారు. బాలుడు చికిత్సపొందుతూ సోమవారం మృతి చెందాడు. బాలుడి మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్సు అడిగినా ఇవ్వకపోవడంతో కుటుంబ సభ్యులు ప్రైవేటు వాహనంలో బొడ్డవర రైల్వే స్టేషన్​కు తీసుకువచ్చారు. డబ్బులు లేకపోవడంతో తెలిసిన వారి దగ్గర 3వేల రూపాయలు అప్పుచేసి బాలుడి మృతదేహాన్ని తరలించారు.

ABOUT THE AUTHOR

...view details