మహిళలకు వివిధ రంగాల్లో ఉచిత శిక్షణ - కుప్పంలో అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతం చేస్తా: నారా భువనేశ్వరి - Nara Bhuvaneshwari in kuppam - NARA BHUVANESHWARI IN KUPPAM
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 26, 2024, 2:36 PM IST
Nara Bhuvaneshwari Started Skill Development Center Under NTR Trust in Kuppam : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఇవాళ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలో ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు. మహిళలకు వివిధ రంగాల్లో ఉచిత శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు భువనేశ్వరి పేర్కొన్నారు. చిరు వ్యాపారస్తులకు సైకిళ్ళు తోపుడుబండ్లను వితరణగా అందజేశారు.
ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రారంభించిన ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో విద్య, ఉపాధి, వైద్యం రంగాలకు సంబంధించి ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో కార్యక్రమాలను విస్తృతం చేస్తామన్నారు. మహిళలకు అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామన్నారు. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు తోడ్పాటుగా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆమె వెల్లడించారు.