ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన - 3 అన్నా క్యాంటీన్ల ప్రారంభానికి సిద్ధం - నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 20, 2024, 2:11 PM IST

Nara Bhuvaneshwari Kuppam Tour: మంగళవారం (నేటి) నుంచి ఈ నెల 23వ తేదీ వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నాలుగు రోజులపాటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నేడు ఆమె కుప్పంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో భువనేశ్వరి బెంగుళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆమె కుప్పం బయల్దేరి వెళ్లారు. కుప్పం నియోజకవర్గంలోని మహిళలతో 21వ తేదీన భువనేశ్వరి ముఖాముఖి నిర్వహించనున్నారు. కుప్పంలో భువనేశ్వరి 3 అన్నా క్యాంటీన్లను సైతం ప్రారంభించనున్నారని టీడీపీ నేతలు వివరించారు.  బెంగుళూరు విమానాశ్రయంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు భువనేశ్వరికి ఘనంగా స్వాగతం పలికారు.

చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై మృతి చెందిన అభిమానుల కుటుంబాలను పరామర్శించడానికి భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనలో  15మంది కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్నారని, వారికి భువనేశ్వరి 3 లక్షల ఆర్థిక సహాయం చేయనున్నట్లు టీడీపీ నేతలు వెల్లడించారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా కుప్పం, పలమనేరు, పుంగనూరు, పూతలపట్టు, చిత్తూరు, జీడి నెల్లూరు, సత్యవేడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్లు తెలుగుదేశం నేతలు వివరించారు.  

ABOUT THE AUTHOR

...view details