తెలంగాణ

telangana

ETV Bharat / videos

బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మయన్మార్ దేశస్థుల ఆందోళన - Myanmar Citizens protest for murder

By ETV Bharat Telangana Team

Published : Jan 29, 2024, 10:22 PM IST

Myanmar Citizens protest Against Murder : ఈ నెల 28న భాగ్యనగరంలో హత్యకు గురైన మయన్మార్​ దేశస్థుడు ఇబ్రహీంకు న్యాయం చేయాలంటూ ఆ దేశ పౌరులు నిరసన చేశారు. తమ దేశంలో హింసలు, అఘయిత్యాలు జరుగుతున్నాయని భారతదేశానికి వస్తే ఇక్కడ కూడా అవే దౌర్జన్యాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న బాలాపూర్​ పోలీసులు రక్షణ బలగాలతో ఘటనా సల్థానికి చేరుకున్నారు.  

మయిన్మార్ దేశస్థులు చేస్తున్న నిరసనను ఆపే క్రమంలో సివిల్​ హెడ్​కానిస్టేబుల్​ శ్రీశైలం తలకు గాయం అయింది. అనంతరం స్థానిక, మయన్మార్​ దేశస్థుడు, రాజకీయ నేత అంజదుల్లాహ్ ఖాలేద్ సహాయంతో పోలీసులు నిరసకారులను శాంతింప చేశారు. చివరికి మయన్మార్​ దేశస్థులు ఇబ్రహీం మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారు.  

అసలేం జరిగిదంటే : ఆదివారం రోజున అసిఫ్ అనే రౌడీ షీటర్ ఇబ్రహీం అనే మయన్మార్​ దేశస్థుడిని హత్య చేశాడు. ఆసిఫ్​ పదిరోజుల క్రితం తన అనుచరుడితో కలిసి ఇబ్రహీం మొబైల్​ను బలవంతంగా తీసుకెళ్లాడు. ఆ తరువాత ఆదివారం అసిఫ్, ఇబ్రహీం ఒకరినొకరు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఇబ్రహీం తన మొబైల్​ఫోన్​ ఇవ్వాలంటూ అసిఫ్​ను అడిగాడు. దీంతో అసిఫ్ కత్తి తీసి ఇబ్రహీంని పొడిచాడు. దీంతో ఇబ్రహీం అక్కడికక్కడే మృతి చెందాడు.  

ABOUT THE AUTHOR

...view details