2041 మాస్టర్ ప్లాన్ వీఎంఆర్డీఏది కాదు - విజయసాయి రెడ్డి స్కాం ప్లాన్: మూర్తి యాదవ్ - Murthy Criticize VMRDA Master Plan - MURTHY CRITICIZE VMRDA MASTER PLAN
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 15, 2024, 4:41 PM IST
Murthy Yadav Criticized the Master Plan Prepared by VMRDA: విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ రూపొందించిన 2041 మాస్టర్ ప్లాన్ పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ విమర్శించారు. అది వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ కాదని విజయసాయి రెడ్డి స్కాం ప్లాన్‌గా అభివర్ణించారు. విజయసాయి రెడ్డి బృందం అవినీతి, కబ్జాల కోసమే మాస్టర్ ప్లాన్ తెచ్చారని మూర్తి యాదవ్ ఆరోపించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్‌ను తయారు చేయాలన్నారు.
విజయసాయిరెడ్డి బృందం అవినీతి, అక్రమాలు, కబ్జాలు, బెదిరింపుల కోసమే ఈ మాస్టర్ ప్లాన్‌ను తెరపైకి తెచ్చిందని ఆయన ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మాస్టర్ ప్లాన్ పట్ల 9,300 అభ్యంతరాలు వచ్చాయని చెప్పారు. ఈ మాస్టర్ ప్లాన్ అమలు జరిగితే విశాఖ రీజియన్ పరిధిలోని లక్షల మంది భవిష్యత్తు అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు నష్టం కలిగే మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలంటూ ప్రజా ఫిర్యాదుల వేదికలో వీఎంఆర్డీఏ ఇన్ఛార్జ్ మెట్రోపాలిటన్ కమిషనర్‌కు మూర్తి యాదవ్ ఫిర్యాదు చేశారు.