ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మున్సిపాలిటీ అధికారుల అత్యుత్సాహం - ఇంటి పన్ను కట్టలేదని విద్యుత్ కనెక్షన్లు తొలగింపు - House Electricity Disconnected

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 21, 2024, 11:47 AM IST

Municipality Authorities Enthusiasm at Atmakuru: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ అధికారులు (Municipal Authorities) అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇంటి పన్ను బకాయిలు చెల్లించలేదంటూ పెద్ద మసీదు ప్రాంతంలో కొంతమంది ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు తొలగించడంతో (Remove house electrical connection) స్థానికులు భగ్గుమన్నారు. ఇంటి పన్నులు కట్టకుంటే నోటీసులు ఇవ్వాలి కానీ ఇలా విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరి ఇళ్లలో విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారని, ఇలా విద్యుత్ కనెక్షన్ తొలగించడం వల్ల నష్టపోతారని తల్లిదండ్రులు వాపోయారు.

మున్నిపల్​ కమిషనర్​ 30 మంది హెల్పర్స్​ వచ్చి ఇంటి పన్ను కట్టలేదని కరెంటు కట్​ చేశారు. ఇంటి పన్నుకి కరెంటు ఏమిటి సంబంధమని అడిగినా పూర్తిగా సమాధానం లేదు. పన్ను కట్టేంతవరకు కరెంటు కట్​ చేయమని ఆదేశాలు వచ్చాయని కమిషనర్​ అన్నారు. మాకు ఏ నోటీసులు ఇవ్వకుండా కరెంటు తీసేయడమేంటని అడిగినా పట్టించుకోలేదు. ఏఈ కూడా కమిషనర్​ ఈ విధంగా ప్రవర్తించడం ఎక్కడా చూడలేదని ఆశ్చర్యానికి గురవుతున్నారు. - ఆత్మకూరు గ్రామ ప్రజలు 

ABOUT THE AUTHOR

...view details