గుంటూరులో 'లెట్స్ ఓట్'3కె- 82శాతానికి పైగా ఓటింగ్ లక్ష్యం : సీఈవో ముఖేష్ - vote awareness program - VOTE AWARENESS PROGRAM
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 27, 2024, 1:40 PM IST
Mukesh Kumar Meena Vote Awareness Program at Guntur : దేశ, రాష్ట్ర భవిష్యత్ యువత చేతిలోనే ఉందని సీఈవో ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం యువత బాధ్యతన్న సీఈవో కొత్తగా ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్కరూ తప్పకుండా వినియోగించుకోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో ఓటింగ్ శాతం మెరుగ్గా ఉందని ముఖేష్ కుమార్ స్పష్టం చేశారు.
Guntur Lets Vote 3k Program : గతంలో ఓటింగ్ 79 శాతం ఉందని, ఈసారి 82 శాతానికి పైగా ఓటింగ్ నమోదే లక్ష్యమని మీనా వెల్లడించారు. మొదటిసారిగా ఓటు వేస్తున్న ఓటర్లతో కలిసి గుంటూరులో 'లెట్స్ ఓట్' 3కె నడక కార్యక్రమం సీఈవో నిర్వహించారు. అర్బన్ ఏరియాలో ఓటింగ్ తక్కువగా ఉందని, ఓటింగ్ కు దూరంగా వారిని గుర్తించినట్టు ముఖేష్ తెలిపారు. రెసిడెంట్ వెల్పేర్ అసోసియేషన్తో సమన్వయం చేసి ఓటింగ్ శాతం పెంచేలా ప్రయత్నిస్తున్నామన్నారు. మే13న పెయిడ్ హాలిడేగా ప్రకటించామని ముఖేష్ స్పష్టం చేశారు.