ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

జగన్ కొత్త హెలికాఫ్టర్లపై సీఈసీకి ఎంపీ రఘురామ ఫిర్యాదు - త్వరలో వైసీపీకి గుడ్​బై - Raghurama complaint against Jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2024, 8:13 PM IST

MP Raghurama Complain to CEC about Jagan Helicopters: ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల వ్యయ నియమావళి ఉల్లంఘించారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. జగన్  నిబంధనలకు విరుద్ధంగా హెలికాప్టర్లను విజయవాడ ఒకటి, విశాఖలో ఒకటి పెట్టాలని నోటిఫికేషన్ విడుదల చేయడంపై రఘురామ అభ్యంతరం వ్యక్తం చేశారు. 2 హెలికాప్టర్లకు నెలకు 3 కోట్ల 82 లక్షలు రూపాయలు ఖర్చు చేస్తున్నారని సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు. వ్యక్తిగత భద్రత పేరుతో ఎన్నికల ప్రచారానికే జగన్ ఈ విధమైన ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజా ధనంతో హెలికాప్టర్లు ఏర్పాటు చేయడంపై జోక్యం చేసుకోవాలని రఘురామ కోరారు.  

MP Ragharama Krishnamraju Resigns from YCP: వైసీపీకు రాజీనామా చేయనున్నట్లు ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రకటించారు. ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో నిర్వహించే తెలుగుదేశం- జనసేన బహిరంగ సభలో పాల్గొంటానని తెలిపారు. ఏ పార్టీ నుంచి పోటీ చేయనున్నానో త్వరలో వెల్లడిస్తానని రఘురామ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details