ఎంపీ గల్లా జయదేవ్ ఈ నెల 28న కృతజ్ఞతా సభ - వైఎస్సార్సీపీ కక్ష సాధింపు కారణమేనా? - టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 27, 2024, 6:15 PM IST
MP Galla Jayadev Thanksgiving Meeting : గుంటూరులో ఎంపీ గల్లా జయదేవ్ ఈ నెల 28న కృతజ్ఞతా సభ నిర్వహించనున్నారు. పది సంవత్సరాలు పాటు తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపేందుకు ఈ సభ ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీతో పాటు పార్లమెంటులోనూ గల్లా జయదేవ్ క్రియాశీలకంగా వ్యవహరించారు. అమరావతి ఉద్యమంలోనూ పాల్గొన్నారు. రాజధాని అమరావతి గురించి పార్లమెంటులో మాట్లాడారు. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమరరాజా కంపెనీలపై కేసులు బనాయించడంతో పాటు సంస్థను మూసివేయించేందుకు ప్రయత్నించింది. కక్ష సాధింపు రాజకీయాల వల్ల జయదేవ్ అమరరాజా సంస్థల విస్తరణ ఏపీలో కాకుండా తెలంగాణ, తమిళనాడులో చేపట్టారు.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నప్పటికీ రానున్న ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారు. పోటీ నుంచి తప్పుకున్నా టీడీపీలోనే కొనసాగుతానని వెల్లడించారు. అయితే తనను రెండు సార్లు ఎంపీగా గెలిపించిన జిల్లా ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ నెల 28న సభ నిర్వహిస్తున్నారు. గల్లా జయదేవ్ కుటుంబ సభ్యులంతా ఈ సమావేశంలో పాల్గొంటారు.