అనకాపల్లి జిల్లాకు రానున్న ప్రధాని మోదీ - ఎప్పుడంటే? - CM RAMESH ON MODI TOUR
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 26, 2024, 5:40 PM IST
PM Modi Will Come to Anakapalli District : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో అనకాపల్లి జిల్లాకు వస్తున్నట్లు ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. నక్కపల్లిలో ఏర్పాటు కానున్న పరిశ్రమకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోదీ వస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా నక్కపల్లిలో ఏడు మిలియన్ టన్నులా సామర్థ్యంతో మరో ప్రైవేటు ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. అనకాపల్లికి రావాలని ప్రధాని మోదీని అడిగిన వెంటనే ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
అనకాపల్లి జిల్లాకు మరిన్నీ పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సీఎం రమేష్ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని వెల్లడించారు. గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. బుచ్చయపేట మండలం పి. భీమవరంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాజు, సత్యనారాయణలు పాల్గొన్నారు.