8 నెలల పసికందును నీటితొట్టెలో పడేసి తల్లి ఆత్మహత్య - Mother Commits Suicide With Child - MOTHER COMMITS SUICIDE WITH CHILD
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 10, 2024, 10:49 PM IST
Mother Commits Suicide by Throwing her Child in Water Tank: ఓ తల్లి కన్న బిడ్డను నీటి తొట్టిలో వేసి తానూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా మల్లికార్జునపల్లిలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో గ్రామం మొత్తం విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన చెందిన శాంత కుమార్, మమత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మమత (24) తన చిన్న కూతురు (8 నెలల పసికందు)ను స్నానాల గదిలోని నీటి తొట్టెలో వేసి తానూ అదే గదిలో పైకప్పుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పసికందును నీటి తొట్టెలో వేసి తాను ఉరివేసుకోవడంతో తల్లి బిడ్డలకు ఏం కష్టం వచ్చిందో అంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆ ఇంటి ముందు రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాలను పంచనామా నిమిత్తం కళ్యాణదుర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య గొడవ, అనారోగ్య సమస్యలతో ఉరి వేసుకుందని మమత తండ్రి చిత్తప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పట్టణ సీఐ హరినాథ్ తెలిపారు.