LIVE: విజయవాడలో మంత్రులు రామానాయుడు, నారాయణ మీడియా సమావేశం - TDP Leaders Fire on Jagan - TDP LEADERS FIRE ON JAGAN
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 11, 2024, 4:39 PM IST
|Updated : Sep 11, 2024, 5:20 PM IST
TDP leaders Fire on Ex CM YS Jagan: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మంత్రులు తమదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రం ఓ వైపు వరదలతో అల్లాడుతుంటే ఆయన మాత్రం బురద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. విపత్కర పరిస్థితుల్లో జగన్ తీరు చూసి 11 సీట్లైనా ఎందుకు ఇచ్చామని ప్రజలు బాధపడే పరిస్థితి కనిపించిందని మంత్రులువ్యాఖ్యానించారు. ఆయన ఫేక్‌తో పెరిగి అసత్యాలతో రాజకీయ జీవితం సాగిస్తున్నారని విమర్శించారు. ఈ విషయం రోజూ రుజువు చేసుకుంటున్నారని వ్యంగాస్త్రాలు సంధించారు. దేశంలో సీఎంగా పని చేసిన ఏ ఒక్కరూ ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పలేరని పేర్కొన్నారు. బురద రాజకీయం చేయలేదని చెప్పారు. బుడమేరు, డైవర్షన్ కెనాల్, రెగ్యులేటర్ ఎక్కడున్నాయి? గండ్లు ఎప్పుడు ఎక్కడ పడ్డాయి? అని ప్రశ్నించారు. కృష్ణా నది ప్రవాహాలు ఎలా వచ్చాయనే కనీస అవగాహన కూడా లేకుండా జగన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒక ఫేక్‌ను పట్టుకుని అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలో మంత్రులు, విజయవాడ ఎంపీ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం మీ కోసం
Last Updated : Sep 11, 2024, 5:20 PM IST