ఆసుపత్రుల్లో భద్రతపై మంత్రులు అనిత, సత్యకుమార్ చర్చలు - Ministers Discuss Safety of Doctors - MINISTERS DISCUSS SAFETY OF DOCTORS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 17, 2024, 8:12 PM IST
Ministers Anitha and Satyakumar Discuss Safety of Doctors: ఆసుపత్రుల్లో సురక్షిత పని వాతావరణం కల్పించేందుకు హోం, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు కలిసి పని చేయాలని నిర్ణయించాయి. వైద్యుల భద్రతపై మంత్రులు అనిత, సత్యకుమార్ యాదవ్ చర్చించారు. వైద్యుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు అన్ని ఆసుపత్రుల్లోని ఔట్‌పోస్టుల వద్ద నిరంతరం పోలీసు భద్రతను పెంచాలని హోం మంత్రి అనితను ఆరోగ్య మంత్రి మంత్రి సత్యకుమార్ కోరారు. అన్ని ఆసుపత్రుల వద్ద నిరంతర భద్రత పర్యవేక్షణకు సీసీటీవీల ఏర్పాటుకు హోం మంత్రి హామీ ఇచ్చారు. ఆసుపత్రుల, ఔట్‌పోస్ట్‌ల్లో పోలీసు సిబ్బందిని మోహరిస్తామని అనిత వెల్లడించారు. ఆసుపత్రులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బందిపై దాడులు జరిగితే తక్షణమే ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసి, సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు. కళాశాలలు, ఆసుపత్రి ఆవరణల్లో సిబ్బందికి సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించేందుక ప్రత్యేక విధానం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు పని చేసుకునేలా రెండు మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు. న్యాయం కోసం పోరాడుతున్న వైద్యులకు తన మద్దతు ఉంటుందని అనిత పేర్కొన్నారు.